Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుహీరోగా విజయ్ సేతుపతి కుమారుడు..

హీరోగా విజయ్ సేతుపతి కుమారుడు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతడు కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఫీనిక్స్’. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, సూర్య సేతుపతి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, హీరోగా మారడానికి పడిన శ్రమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

సినిమాల్లోకి రావడానికి ముందు తాను 120 కిలోల బరువు ఉండేవాడినని సూర్య తెలిపాడు. ఆ బరువు తగ్గించుకోవడానికి తనకు సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందని వివరించాడు. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదని, ముఖ్యంగా మొదటి ఆరు నెలలు చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఆహారంలో చక్కెర, నూనెను పూర్తిగా మానేయడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నాడు. ఇదే సమయంలో, నటనకు ఉపయోగపడే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు.

తనకు ఈ సినిమాలో అవకాశం రావడానికి తన తండ్రి విజయ్ సేతుపతి పరోక్షంగా కారణమయ్యారని సూర్య గుర్తుచేసుకున్నాడు. “నాకు ముందు నుంచే సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉంది. నాన్న నటిస్తున్న ‘జవాన్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో నేను సెట్స్‌కు వెళ్లాను. అక్కడ నన్ను చూసిన దర్శకుడు అనల్ అరసు, ‘ఫీనిక్స్’ కథ గురించి నాన్నకు చెప్పారు” అని సూర్య వివరించాడు.

వెంటనే విజయ్ సేతుపతి స్పందిస్తూ, “కథను ముందు సూర్యకు చెప్పండి. అతనికి నచ్చి, ఓకే అంటే నాకేమీ అభ్యంతరం లేదు. సినిమాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం” అని దర్శకుడితో చెప్పినట్లు సూర్య తెలిపాడు. ఆ తర్వాత దర్శకుడు తనకు కథ వినిపించడం, నచ్చడంతో వెంటనే అంగీకరించానని అన్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీశ్ ఉత్తమన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫీనిక్స్’ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad