Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ నిబంధన మేరకే రైస్ మిల్ నడపాలి

ప్రభుత్వ నిబంధన మేరకే రైస్ మిల్ నడపాలి

- Advertisement -

అడిషనల్ కలెక్టర్ విక్టర్ 
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
: ప్రభుత్వ నిబంధనల మెరకే రైస్ మిల్లు నడపాలని, రైతులకు ఇబ్బంది పెట్టవద్దని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. బుధవారంమండల కేంద్రంలోని శ్రీ సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ రైస్ మిల్లు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైస్ మిల్లు ధాన్యం, బియ్యం పరిశీలించి, రైస్ మిల్లు నిల్వ ఉన్న ధాన్యం బియ్యంను నిల్వ ఉంచే విధానం అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్ సంబంధించిన రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉన్నాయా లేవో పరిశీలించారు.

అనంతరం రికార్డులను చూసి తెలుసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మరియు రైస్ మిల్ ఉత్పత్తి అయ్యే బియ్యం నాణ్యతను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, రైస్ మిల్ నిర్వాహకులకు సూచించారు. రైస్ మిల్ నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా నడపాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వనమోత్సవ కార్యక్రమంలో భాగంగా రైస్ మిల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్ఓ మల్లికార్జున్, బిచ్కుంద నయాబ్ తాసిల్దార్ ఖలీల్, రైస్మిల్ నిర్వాహకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad