Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలుమూసీపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

మూసీపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్: మూసీ పునరుజ్జీవంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలోపు మూసీ ప్రక్షాళన పూర్తి చేయాలని అన్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటివరకు పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img