Thursday, July 3, 2025
E-PAPER
Homeజిల్లాలుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కడియం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కడియం

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మసాగర్ మండలానికి చెందిన 71మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 71లక్షల 08వేల 236రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దరఖాస్తు చేసుకున్న 3నుండి 4నెలలలో లబ్ధిదారులకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో చెక్కులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు పారదర్శకంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మండలంలో 2139 మందికి 18కోట్ల 67లక్షల 18వేల రూపాయలను అందజేసినట్లు తెలిపారు.

ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పేద ప్రజల సంక్షేమనికి కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. 10ఏళ్ళు అధికారంలో ఉండి వేల కోట్లు సంపాదించుకొని, ఆ అవినీతి సొమ్ముతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చీమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో, రాష్ట్ర హక్కులను కాపాడడంలో వెనకడుగు వేసేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపిడివో అనిల్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -