త్వరలో ప్రభుత్వానికి నివేదిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో చేపట్టిన కులగణన అధ్యయన నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందించనున్నట్టు స్వతంత్ర నిపుణుల కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో సమా వేశమై తుది నివేదికపై చర్చించినట్టు పే ర్కొంది. కులగణనలో పేర్కొన్న 242 కులా లకు వెనుకబాటుతనం పై కంపొజిట్ బ్యాక్‌వర్డ్ నెస్ ఇండెక్స్ (సీబీఐ) సూచీని నివేదికలో పొందుపర్చామని పేర్కొన్నారు. సమావేశంలో నిపుణుల కమిటీ వైస్ చైర్మెన్ కంచ ఐలయ్య, కన్వీనర్ ప్రవీణ్ చక్రవర్తి, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖ్‌దేవ్ థారోట్, డాక్టర్ హిమాన్షు, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిటీ కార్యదర్శి అనుదీప్ దూరిశెట్టి పాల్గొన్నారు.
తుది దశకు చేరిన కులగణన అధ్యయనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



