Thursday, July 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసెంబ్లీలో చర్చకు సిద్ధం

అసెంబ్లీలో చర్చకు సిద్ధం

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డివన్నీ అబద్ధాలే
– బనకచర్లపై చంద్రబాబుతో చీకటి ఒప్పందం : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బనకచర్లపై సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గురుదక్షిణ చెల్లించుకుంటూ తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అసెంబ్లీలో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారనీ, బనకచర్లపై కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్‌ రెడ్డి బనకచర్లపై చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుట్రలు తెలియగానే బీఆర్‌ఎస్‌ నిలదీసిందని గుర్తుచేశారు. అపెక్స్‌లో బనకచర్ల లేకున్నా ..ఉందని సీఎం అబద్ధాలాడుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని విమర్శించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ కృష్ణా నీటిలో వాటా కోసం కూడా పోరాడారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి, పాలమూరు ప్రాజెక్టుకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేసి, నాలుగు రిజర్వాయర్లు పూర్తి చేసినట్టు గుర్తుచేశారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా నీళ్లు వాడని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమని విమర్శించారు. అసెంబ్లీ పెడితే మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నాననీ, అయితే మైక్‌ కట్‌ చేయొద్దని షరతు విధించారు. తెలంగాణకు అన్యాయం చేయొద్దనీ, నిజాయితీగా పని చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -