నవతెలంగాణ – పెద్దవూర
జులై 07 న జరిగే చలో ఈదుముడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముది గొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ పిలుపుమేరకు ఛలో ఈదుముడి వాల్ పోష్టర్ ఆవిష్కరణ చేసి, మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం లో 21 మందితో మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం జాతి ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల సమస్యల మీద పోరాటాలు చేసిందని అన్నారు.
వృద్ధులు, వితంతువులకు, ఆసరా పింఛన్ల పెంపు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి కి 6 కేజీల బియ్యం పెంపు, వంటివి ఎన్నో సాధించుకున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, ఆరోగ్యశ్రీ కార్డు , తెలంగాణ ఉద్యమ సాధనతో పాటు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటివి జరిగాయని అన్నారు. ఇలా అనేక అంశాల మీద పోరాటం చేసి సాధించిన ఘనత ఎంఆర్పిఎస్ కే దక్కుతుందని తెలిపారు.
జూలై 7 నాటికి 31 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుముడి గ్రామంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆది మల్ల శ్రీనివాస్ , ముదిగొండ శ్రీను , దుబ్బ వెంకటయ్య , అనుముల మేరయ్య , చనగళ్ల వెంకన్న , బుడిగపాక విష్ణు , బుడిగపాక కార్తీక్ , సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.