నవతెలంగాణ – రెంజల్..
రెంజల్ మండలం ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో సోమవారం సాటాపూర్ తెలంగాణ చౌరస్తా లో జమ్మూ కాశ్మీర్ ఫహల్గాం గ్రామంలో 28 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులను వెంటనే అరెస్టు చేసి వారికి ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశం అతి త్వరలో పాకిస్తాన్ పై తగిన సమాధానం చెప్పాలని వారన్నారు. భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ భారతీయులేనని, టెర్రరిస్టులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు స్పష్టం చేశారు. దేశంలోని ముస్లింలందరూ భారతీయులమేనని పాకిస్థాన్ కు తమకు ఎలాంటి సంబంధం లేదనీ వారు స్పష్టం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వక్పు అమయింట్మెంట్ బిల్లును కేంద్రం రద్దు చేయాలని, ఏదైతే పాత వక్బోర్డ్ ను యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వందలాదిమంది ముస్లిం సోదరులు ప్లే కార్డ్స్ పట్టుకొని సాటాపూర్ చౌరస్తా నుంచి, తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా కాలేజ్ బేగ్, అంజుమ్ బేగ్, ఆబిద్ బేగ్, మోసిన్ బేగ్, కాశీ మొద్దీన్, ముఖిద్, హాజీ ఖాన్, సద్దాం,ఖలీద్, అలీమ్, అన్వర్, షఫీ, మరియు వివిధ పార్టీ నాయకులు అందరు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పహల్గాంలో దాడికి నిరసనగా ముస్లిం సోదరులు ధర్నా
- Advertisement -
RELATED ARTICLES