Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోసిపోయిన గురుకులం

బోసిపోయిన గురుకులం

- Advertisement -

విద్యార్థిని మృతితో ఇంటి బాట పట్టిన విద్యార్థులు 
నవతెలంగాణ – పరకాల
: హనుమకొండ జిల్లా పరకాల మండలం మలక్కపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇటీవల 10వ తరగతి విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో విద్యార్థులు భయాందోళనతో ఇంటిదారి పట్టగా సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ అధికారులు తాత్కాలిక సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం నవతెలంగాణ విలేకరి గురుకుల పాఠశాలను సందర్శించగా విద్యార్థులతో కలకలలాడాల్సిన పాఠశాల ఆవరణ బోసిపోయి కళావిహీనంగా దర్శనమిచ్చింది.

ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అందరి ముఖాల్లో విచార బావం వ్యక్తమవుతుంది. తమ మధ్య ఎంతో అన్యోన్యంగా ఆప్యాయంగా తిరిగే విద్యార్థిని ప్రస్తుతం తమ మధ్య లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీచర్ వేదన భరితంగా విచారం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సోమవారం నుంచి తిరిగి పాఠశాల ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఏదిఏమైనాప్పటికీ శ్రీ వాణి జ్ఞాపకాల నుంచి తేరుకొని విద్యార్థులంతా ఆత్మస్థైర్యంతో విద్యాభ్యాసం చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -