Tuesday, April 29, 2025
Homeజిల్లాలుప్రతి ఒక్కరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కళ నెరవేరాలి..

ప్రతి ఒక్కరి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కళ నెరవేరాలి..

నవతెలంగాణ – జుక్కల్ 
ప్రతి ఒక్కరి పేదవారి బెడ్ రూమ్ ఇండ్ల కళ నెరవేరాలని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు . సోమవారం నాడు మండలంలోని హంగర్గ గ్రామములో ఆయన అభివృద్ధి పనులను సందర్శించారు . ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతు  గ్రామంలో మొదటగా పరిశుభ్రత పాటించాలని అన్నారు . అదేవిధంగా గ్రామాల్లో పేరుకుపోయిన పన్నులను 100% వసూలు చేయాలని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశించారు . అభివృద్ధి పనులైన నర్సరీ  పెంపకం , ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పుడు సందర్శించి పనులను సక్రమంగా చేసే విధంగా పురమాయించాలని తెలిపారు . సంబంధిత అధికారులను కలుపు కొని అభివృద్ధి బాటలో నడుచుకోవాలని ఎంపీడీవో తెలిపారు . అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . లబ్ధిదారులను గుర్తించేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితి , కుటుంబం ఆర్థిక పరిస్థితి , కుటుంబ నేపద్యం అన్ని పరిగణలోకి తీసుకొని అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొరకు మంజూరు చేయడానికి గ్రామ కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు . ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img