Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీ రికార్డులను పరిశీలించిన ఎంపీఓ రాము

జీపీ రికార్డులను పరిశీలించిన ఎంపీఓ రాము

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని నాగుల్ గావ్ గ్రామంలోని అభివృద్ధి పనులను, అభివృద్ధి పనులను ఎంపీఓ రాము గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి నర్సరీలో పెంచిన మొక్కలను పంపింణి చేయడం జరిగింది. అనంతరం వారిచే మొక్కలు నాటించి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నాటిన వారికి  తెలియజేశారు.

అనంతరం గ్రామంలోని పారిశుధ్య పనులను వీధిలో  క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎప్పటికప్పుడు గ్రామంలో శుబ్రత పాటించాలని  అన్నారు. నీటి ట్యాంకులు వారానికి రెండుసార్లు శుభ్రం చేయించాలని సూచించారు. నీరు నిలిచే చోట గుంతలో మట్టిని వేసి కప్పిపుచ్చాలని అన్నారు. దోమల బెడద వ్యాపించకుండా గ్రామంలో ఫాగింగ్ చేయాలని జిపి కార్యదర్శి కి ఆదేశించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు గా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

గ్రామంలో ఆశా వర్కర్లు , అంగన్వాడీ టీచర్లను ఇంటింటికి తిరిగి ఎవరైనా గ్రామంలో అనారోగ్య సమస్యలతో మంచాన పడితే పై అధికారులకు తెలియజేయాలన్నారు. వెంటనే వారిని గుర్తించి మండల ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించాలని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు తాజాగా వండిన ఆహారాన్ని వేడివేడిగా తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి  చర్యలకు ఉపక్రమించాలి అని జీపీ కార్యదర్శికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాముతో పాటు ఎఫ్ ఏ బాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -