Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పడంపల్లి పాఠశాలకు సందర్శించిన ఎంపీడీఓ

పడంపల్లి పాఠశాలకు సందర్శించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: యూపిఎస్ పడంపల్లి పాఠశాలను జుక్కల్ ఎంపీడీవో గురువారం పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాలయ్యని అడిగి తెలుసుకొన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, 6, 7వ తరగతి కి నోట్ బుక్స్ మరియు యూనిఫామ్స్ ఇచ్చిన రిజిస్టర్ను పరిశీలించారు. ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరును చూడడం జరిగింది. పిల్లలకు నాణ్యమైన భోజనం, మెను ప్రకారం ఎండిఎం వారు  అందించాలని అన్నారు.

సలహాలు సూచనలు హెచ్ఎంకు, ఉపాధ్యాయులందరికి తెలియజేశారు. ఉపాధ్యాయులు తమ విధులకు సమయానుకునంగా రావాలని సూచించారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు. విద్యాబోధనకు నడుం బిగించాలని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామంలో ఇంటింటికి తిరిగి అరులైన విద్యార్థులను అడ్మిషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రయివేట్ పాఠశాలలకు మగ్గుచూపుతున్న తల్లిదండ్రులను అవగాహన పర్చాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు వారికి వివరించాలని సూచించారు. ఉత్తమ విద్యాబోధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. పాఠశాలలో అందుతున్నా సౌకర్యాలను చూసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -