Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జమ్మపురం రైతుల బాట కబ్జా..?

జమ్మపురం రైతుల బాట కబ్జా..?

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పొలాలకు వెళ్లే దారిని మూసి వేయిస్తున్న ఘనుడు. అంగ బలం, అర్థబలం ఉన్న వ్యక్తి అవడంతో అధికారులను కూడా మ్యానేజ్ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురం గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేనెంబర్ 552, 561 మధ్యలో ఉన్న రైతులు వినియోగించే వందల సంవత్సరాల నాటి బాటను మూసివేసి సర్వేనెంబర్ 561 లో ఉన్న తన పొలానికి ఆనుకొని ఉన్న దారిని కిలారి మాధవరావు అనే వ్యక్తి ఫెన్సింగ్ వేస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

వివరాలను పరిశీలిస్తే 100 సంవత్సరాలకు నుంచి ఉన్న  ఊరు పుట్టి నుంచి ఉన్న బాటను భువనగిరి మండలంలోని జమ్మాపురం పరిధిలో గల విత్తనాల కంపెనీ మెయిన్ రోడ్డు ప్రధాని రహదారి బాట నుంచి జమ్మాపురం గ్రామానికి బాట ఉందని,  ఈ బాటను బాదుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల పొలాల నుంచి రాత్రిపూట డోజర్ల సహాయంతో కూర్చి వేశాడని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు. 

సుమారు వంద సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి బాటను వేల ఎకరాలు ఉన్నటువంటి  ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి గ్రామస్తులను  భయభ్రాంతులకు గురిచేస్తూ బాటను మూసివేశాడు. గ్రామస్తులు అందరూ కలిసి గత మూడు రోజులుగా బాటను సరిచేయాలని కోరుతూ బాట వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు – మాదాని ఇన్నాసమ్మ.

నీకు నాకు సుమారు 70 సంవత్సరాలు ఉన్నాయని, నేను పుట్టినప్పటినుంచి ఈ బాటని నడుస్తున్నానని, భయభ్రాంతులకు గురి చేస్తూ మాధవరావు అనే వ్యక్తి బాట అభ్య చేస్తున్నారని ఆరోపించారు – చిన్న బత్తిని బాల్త రాజు .














- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -