నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : రైతుల బాటను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిలారి మాధవరావుపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య కోరారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని జమ్మాపురం గ్రామ పరిధిలో కబ్జా చేసిన బాటను వారు పరిశీలించి , మాట్లాడారు. సుమారు 30 మంది రైతుల 70 ఎకరాల భూమికి ఉన్న బాటను జమ్మాపురం గ్రామం ఏర్పడక ముందు ఉన్నటువంటి బాటను ఇప్పటికీ ఆ గ్రామ రైతులు, గ్రామస్తులు అదే బాట వెంబడి నడుస్తున్నారు.
ఈమధ్య కాలంలో కిలారీ మాధవరావు అనే వ్యక్తి , అతని అనుచరులతో కలిసి బాటను మూసివేసి గోడ నిర్మాణం చేపడుతున్నారు. బాటలో గోడ నిర్మాణం చేస్తున్న సందర్భంలో రైతులు విషయం తెలుసుకొని వారిని అడ్డుకున్నారు. వెంటనే భువనగిరి సీపీఐ(ఎం) మండల కమిటీ తరఫున జమాపురం బాటను కబ్జా చేసిన స్థలాన్ని పరిశీలించి, రెవిన్యూ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారం అందుకున్న భువనగిరి తహసీల్దార్ అంజిరెడ్డి సంబంధిత స్థలాన్ని పరిశీలించి, రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి పారదర్శకంగా బాట సర్వేను పంచనామా సర్వే నిర్వహించి, గ్రామస్తులకు, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి, రజక సంఘం జిల్లా కార్యదర్శి వడ్డబోయిన వెంకటేశం , రైతులు లూథియానా, ఆరోగ్యం, స్వర్ణ,లుర్తయ్య, ఆగప్ప, బల్ద రాజు, ఆంటోని, ఇన్ని సెంటు, బాలస్వామి, ఎన్నాశమ్మ, మరియమ్మ లు పాల్గొన్నారు.
రైతుల బాటను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES