జిల్లా అదరపు కలెక్టర్ భాస్కర్ రావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జిల్లా కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ కె భాస్కర్ రావు జిల్లాలోని భవిత కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల రిపేర్ల గురించి పలు సూచనలు చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సరిపడా సౌకర్యాలు ఉండే విధంగా పక్కా భవనాలున్న భవిత కేంద్రాలలో రిపేర్లు చేయించాలని,నూతనంగా నిర్మించే కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల రిపేర్లలో ప్రత్యేక అధికారుల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా బాలికలకు సరిపోను టాయిలెట్లు,నీటి సౌకర్యం , ప్రహరీ గోడ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ఏడిఎన్ ప్రశాంత్ రెడ్డి, ఈ డబ్ల్యూ ఐ డి సి ఈఈ డి శైలజ, డిఈఈ శివకుమార్, ఏఈ లు,విద్యా శాఖ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.