Friday, July 4, 2025
E-PAPER
Homeఖమ్మంపారిశుధ్యం పట్ల శ్రద్ద వహించాలి: డీఎల్పీఓ ప్రభాకర్ రావు

పారిశుధ్యం పట్ల శ్రద్ద వహించాలి: డీఎల్పీఓ ప్రభాకర్ రావు

- Advertisement -

వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: పల్లెల్లో పారిశుధ్యం పై శ్రద్ద పెట్టాలని,ఆసపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలని డివిజనల్ పంచాయితీ అధికారి ప్రభాకర్ సూచించారు. ఆయన గురువారం మండలం లోని వినాయక పురం, ఊట్లపల్లి,పాత రెడ్డి గూడెం లను సందర్శించి శానిటేషన్ పనులను పర్యవేక్షణ చేసారు. సిబ్బందికి తగు సూచనలు జారీ చేసి పంచాయతీ రికార్డు లను తనిఖీ చేసారు.రికార్డులు సక్రమంగా ఉండాలని శానిటేషన్ విషయం లో ఎక్కడ అశ్రద్ధ చూపవద్దు అని అన్నారు.

వినాయకపురం లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించి మండలం లో సోకుతున్న జ్వరాలు,ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామ ల గురించి డాక్టర్ రాందాస్ ను అడిగి తెలుసు కొని ఆరోగ్య శాఖ పరంగా తీసుకో వలసిన చర్యలు గురించి చర్చించి తగు సూచనలు ఇచ్చి,పంచాయతీ విభాగం నుండి ఎప్పుడూ పూర్తి  సహకారం మీకు ఉంటుందని బరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -