Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు 

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు 

- Advertisement -

పకడ్బందీగా 100 డేస్ – 50 ప్రోగ్రామ్స్ – కమిషనర్ రమేష్ కుమార్ 
నవతెలంగాణ – దుబ్బాక
: మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, “100 డేస్ – 50 ప్రోగ్రామ్స్” అన్న కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ తెలిపారు. అందులో భాగంగానే గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధి లచ్చపేట పదో వార్డులో బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ ప్లాట్లలో నిలిచి ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేశామన్నారు. డీఆర్ సీసీ నిర్వహణ, దోమల నియంత్రణకు ఫాగింగ్, మాస్ క్లీనింగ్ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మున్సిపల్ ప్రజలు తమ ఇంటి పరిసరాలతో పాటు చుట్టుప్రక్కలా, ఆరుబయట, మురికి కాలువల్లో చెత్తను పడేయకుండా.. మున్సిపాలిటీకి చెందిన చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించి స్వచ్ఛ దుబ్బాక కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట ఇన్చార్జి శానిటరీ ఇన్ స్పెక్టర్ దిలీప్, వర్క్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -