నవతెలంగాణ – ఆర్మూర్
బుద్ధుడి నాటక ప్రదర్శన శనివారం మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లోని ఎం.ఆర్ గార్డెన్లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే నిర్వహిస్తామని డివిజన్ అధ్యక్షులు మాదరి రాజన్న, ప్రధాన కార్యదర్శి ముగా ప్రభాకర్, పింజ పెద్ద బోజన్న, కోటేశ్వరరావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ చౌరాస్తా వద్ద నాటిక పోస్టర్ ఆవిష్కరించారు.
నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం, ప్రజ్ఞ, శీల, కరుణ, సామ్రాట్ అశోకుడు హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం ప్రదర్శించబడునని తెలిపారు. 2500ఏండ్ల తర్వాత విశ్వజ్ఞాని డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అకాడమీ 30మంది కళాకారులతో, మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ప్రదర్శించ నున్నారు. పట్టణ పరిసర ప్రజలందరు సమయానికి వచ్చి తిలకించగలరని, ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని, నాటికను జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రాజయ్య, తెడ్డు నర్సయ్య, అంగరి ప్రదీప్, అగ్గు క్రాంతి, కృపాల్, పింజ అశోక్, అర్చన గంగన్న, పొద్దు రిపోర్టర్ ఎం.డి రహీం, సాయిరాం, అంబులెన్స్ రాజు, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.
బుద్దునితో నా ప్రయాణం.. నాటక ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES