వసతుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి
మేడారంలో చేపట్టే పనులను శాశ్వతంగా నిలిచేలా ఉండాలి
పక్కా ప్రణాళిక తో ముందుకు వెళ్ళాలి
కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి మాస్టర్ ప్లాన్
నివేదిక సమర్పించాలి
రాష్ట్ర ఎండోమెంట్స్ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్
నవతెలంగాణ – తాడ్వాయి
రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర సందర్భంగా చేపడుతున్న పనులు శ్వాశతంగా నిలిచేలా పనులను పూర్తి చేయాలని, శాశ్వత అభివృద్ధికి దిశగా మేడారం మహా జాతర, ప్రతి జాతరకు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నమని తెలంగాణ ఎండోమెంట్ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ అన్నారు. గురువారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్స్ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అడ్వైజర్ గోవిందహరి లతో కలిసి శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర, 2026 పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా సౌకర్యాల ఏర్పాటు కొరకు స్టూడియో వన్ ఆర్కిటెక్టర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై క్షేత్ర స్థాయిలో పరిశీలన, పూజారులు, అధికారులతో చర్చించుటకు సమావేశ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టే పనుల మాస్టర్ ప్లాన్ నివేదికను కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పక్క ప్రణాళిక తో రూపొందించాలని అన్నారు. కోటిన్నర భక్తులు హాజరయ్యే ఈ నాలుగు రోజుల జాతరకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చెయ్యాలని అన్నారు.
ప్రతి జాతరకు కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నమని, ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎండోమెంట్ అడ్వైజర్ గోవిందా హరి తో కలిసి మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోగా సమ్మక్క సారలమ్మ పూజారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి గద్దెలపైకి తోడుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ జె సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, ఏ పి ఓ వసంత రావు, ఈ ఓ మేకల వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, పూజారులు, విద్యుత్ శాఖ ఎస్సీ మల్సూర్ నాయక్, డి ఈ పులుసుం నాగేశ్వరరావు, ఏడి వేణుగోపాల్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత అభివృద్ధి దిశగా మేడారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES