Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeసినిమాపైరసీ చేస్తే కఠిన చర్యలు

పైరసీ చేస్తే కఠిన చర్యలు

- Advertisement -

సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నా మని, ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు తెలిపారు.
బుధవారం ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్‌ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫ్‌డిిసి బోర్డు రూమ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,’రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించాం.
ఇండిస్టీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తాం. ఎఫ్‌డీసీ నోడల్‌ ఏజెన్సీగా ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సైబర్‌ సెల్‌, పోలీస్‌ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా చిత్రీకరణలకు ఆన్‌లైన్‌ అనుమతుల ప్రొసెస్‌తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. సినీ పరిశ్రమ అభివద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని అన్నారు. ‘సినిమా జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ అంశంపై సమీక్ష జరిపి, సాధ్యసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇండిస్టీ సమస్యలపై ఎవరైనా తమ దష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి కషి చేస్తాం’ అని ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్‌ ప్రియాంక చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad