Friday, July 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆ కమిటీలో వికలాంగులకు స్థానం లేదా? : ఎన్‌పీఆర్‌డీ

ఆ కమిటీలో వికలాంగులకు స్థానం లేదా? : ఎన్‌పీఆర్‌డీ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వం నియమించిన భాషా సాంస్కృతిక శాఖ అడ్వైజరీ కమిటీలో ఒక్క వికలాంగునికీ స్థానం కల్పించకపోవడం ఎంతవరకు సమంజసమని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం గౌరవాధ్యక్షులు వరమ్మ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్‌, ఎం అడివయ్య, కోశాధికారి ఆర్‌ వెంకటేశ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పథకాలు, సోషల్‌ డెవలప్‌మెంట్‌, సాంస్కృతిక అంశాలపై కృషి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని వికలాంగుల్లో కవులు, కళాకారులు, రచయితలు వందలాది మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వీరిని ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. వికలాంగుల పట్ల ప్రభుత్వమే వివక్షత చూపడం కంచే చేను మేసినట్టువుతుందని తెలిపారు. సకలంగులతో పోటీ పడుతున్న వికలాంగుల ప్రతిభను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్‌ చేశారు. భాషా సాంస్కృతిక శాఖ అడ్వైజరీ కమిటీలో వికలాంగులకు స్థానం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -