Friday, July 4, 2025
E-PAPER
Homeక్రైమ్కాఫీ డేలో అగ్నిప్రమాదం

కాఫీ డేలో అగ్నిప్రమాదం

- Advertisement -

సకాలంలో స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
ఓ మహిళను కాపాడిన ఫైర్‌ అధికారి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని కాఫీ డే క్రిష్‌ ఇన్‌ హౌటల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అధికారులు వెంటనే స్పందించడంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం హౌటల్‌లో ఒక్కసారిగా మంటలు రావడంతో మొత్తం పొగ కమ్ముకుంది. స్థానికులు వెంటనే 100 నంబర్‌కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, తన సిబ్బందిని వెంటనే ఘటనాస్థలానికి పంపించి సనత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని హౌటల్‌ నుంచి అందరినీ కిందకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఓ మహిళకు ఫైర్‌ అధికారి పూర్ణకుమార్‌ తన ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టి కిందకు తీసుకొచ్చి వెంటనే దగ్గరలోని అమీర్‌పేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, హౌటల్‌ కిచెన్‌లోని కొన్ని వస్తువులు దగ్ధమయ్యాయి. హౌటల్స్‌, హాస్టల్స్‌, వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఫైర్‌ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -