– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
– గౌరవవంతమైన జీవితం కోసం నిరంతర పోరాటం : ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి
నవతెలంగాణ- వనపర్తి
మహిళల శ్రమను గుర్తించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ.లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక వ్యతిరేక, మహిళా వ్యతిరేక ప్రభుత్వాలు విధానాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రయివేటీకరణ పెరుగుతోందని, కనీస వేతనం అమలు కావడం లేదని తెలిపారు. మహిళల శ్రమను గుర్తించని ఈ వ్యవస్థను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రత కోసం పోరాడుతూనే ఉండాలని చెప్పారు. జులై 9న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఇది కేవలం కార్మికుల సమస్య కాదు.. ప్రజా జీవనానికి సంబంధించిన సమ్మె అని, అందువల్ల అందరూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు సాయిలీల, కోశాధికారి కవిత, సహాయ కార్యదర్శి ఉమా, ఉపాధ్యక్షులు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్న అఘాయిత్యాలు
దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరుగు తున్నాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమ వుతున్నాయని విమ ర్శించారు. ఓ వైపు ఉద్యోగాలు తగ్గుతుంటే.. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్నాయ న్నారు. మహిళా కార్మికుల హక్కుల పరిరక్షణ, గౌరవవంతమైన జీవితం కోసం ఐద్వా నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. సార్వత్రిక సమ్మెలో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. గ్రామ స్థాయిలో సమ్మె సన్నాహక ప్రచారం చేయాలని, ప్రతి మహిళా సంఘం చైతన్య వేదికలుగా మారాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య రంగం, ఆశా వర్కర్ల సమస్యలు, విద్యారంగంలో మహిళల సవాళ్లు వంటి అనేక అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ సమస్యలను వివరించారు.
మహిళ శ్రమను గుర్తించని వ్యవస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES