– వసతులు, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
– క్షేత్రస్థాయిలో పరిశీలించి మాస్టర్ ప్లాన్ నివేదిక ఇవ్వాలి
– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్
నవతెలంగాణ-తాడ్వాయి
రెండేండ్లకోసారి నిర్వహించే మేడారం మహా జాతర సందర్భంగా చేపడుతున్న పనులు శ్వాశతంగా నిలిచేలా నాణ్యతతో పూర్తి చేయాలని, ప్రతి జాతరకు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నట్టు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తెలిపారు. గురువారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లోని హాల్‌లో జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, అడ్వైజర్ గోవిందహరితో కలిసి సమ్మక్క,సారలమ్మ మహా జాతర-2026పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడారం నాలుగు రోజుల జాతరకు హాజరయ్యే సుమారు కోటిన్నర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టాలని సూచించారు. స్టూడియో వన్ ఆర్కిటెక్టర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ నివేదికను కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పక్క ప్రణాళికతో రూపొందించాలని అన్నారు. అనంతరం మేడారంలోని వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ పూజారులు డోలు వాయిద్యాలతో వారికి స్వాగతం పలికి గద్దెలపైకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్ధార్ జె. సురేష్‌బాబు, ఎంపీడీవో సుమనవాణి, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, జి. సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఏపీఓ వసంతరావు, ఈఓ మేకల వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, పూజారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శాశ్వత అభివృద్ధి దిశగా ‘మేడారం’
- Advertisement -
- Advertisement -