Wednesday, April 30, 2025
HomeUncategorizedవైవిధ్య భరిత ప్రేమకథ

వైవిధ్య భరిత ప్రేమకథ

టిఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్‌ నెంబర్‌ 3 ప్రేమ, కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ, భవ్యశ్రీ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ,’టిఎస్‌ఆర్‌ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూడబోతున్నారు. గతంలో ఈ బ్యానర్‌లో ‘తికమక తాండ, కోబలి’ వంటి భిన్న సినిమాలు వచ్చి, ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘కోబలి’ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో బాగా ట్రెండ్‌ అయ్యింది. అలాంటిది ఈ బ్యానర్‌లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని అన్నారు.’ఈ సినిమా కంటెంట్‌ బాగా నచ్చడంతో నిర్మిస్తున్నాను. కొత్త జోనర్‌లో వైవిధ్యమైన లొకేషన్‌లలో ఈ సినిమాని తెరకెక్కించి, ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతినిస్తాం. ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. హరికృష్ణ, భవ్య శ్రీ మధ్య సహజమైన కెమిస్ట్రీ అందరినీ అలరిస్తుంది. అందరి సహకారంతో తొలి షెడ్యూల్‌ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం’ అని ప్రొడ్యూసర్‌ తిరుపతి శ్రీనివాస రావు చెప్పారు. ఈ చిత్రానికి డీఓపీ : విపిన్‌ వి రాజ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ : గౌతమ్‌ రవిరామ్‌, డైలాగ్స్‌ : విజరు కందుకూరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img