– 18 నెలల నుంచి పట్టించుకోకుండా వ్యవరించడం సరైనది కాదు
– యాజమాన్యాలు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు
– ఫీజుల విడుదల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
– రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయండి
– విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు రజనీకాంత్, టి.నాగరాజు
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్,స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు కేంద్ర కమిటీ సభ్యురాలు ఎం.పూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లడారు.
రాష్ట్రంలో విద్యార్థులు, ప్రైవేటు యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోంటున్నారు. వడ్డీలు తెచ్చి మేం విద్యాసంస్థలను నడపలేము అని పరీక్షలు బాయ్ కాట్ చేశారు. ఇంకోపక్క విద్యార్థులు నుండి పెండింగ్ ఫీజులను బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. కాంగ్రెస్ గత పాలకుల నిర్లక్ష్యంను విమర్శించి వారు అధికారంలోకి వస్తే ఫీజు రీయంబర్స్ మెంట్స్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని ఈ పథకాన్ని మరింత పటిష్టమైన పథకంగా రూపోందించి బకాయిలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13లక్షల మంది విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే సర్టీఫికేట్స్ కోసం కాలేజీలు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోన్ని కళాశాలలు కూడా ముక్కు పిండి మరి వసూళ్లు చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 5 నుండి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపు నిస్తుంది. జూలై 5న మండల, పట్టణ, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, జూలై 6న ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు, జూలై 7న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరు కార్యాలయాల ముందు ధర్నాలకు ఎస్ఎఫ్ఐ పిలుపు ఇస్తుంది. ఈ ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వం స్పందించి ఫీజులను విడుదల చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కోనసాగింపు ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన కార్యక్రమాలలో విద్యార్థులు, విద్యార్ధి తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది.