Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్..

ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్లు పేలుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తునే ఉన్నాం.  తాజాగా ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ సడెన్ గా  పేలింది.  అతడు వేసుకున్న బట్టలకు అంటుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా   రాజేంద్రనగర్ అత్తాపూర్ లో జరిగింది. పెయింటర్ గా పనిచేస్తున్న  శ్రీనివాస్ అనే యువకుడు స్మార్ట్  ఫోన్  వాడుతున్నాడు. తన ప్యాంటు జేబులో పెట్టుకొని వస్తుండగా.. ఒక్కసారిగా ఫోన్ హీటెక్కి మంటలు రావడంతో జేబులో నుంచి ఫోన్ తీశాడు. అప్పటికే  ఫోన్ హీట్ వల్ల శ్రీనివాస్   కాలి తొడ స్వల్పంగా  కాలిపోయింది. వెంటనే స్థానికంగా ఉన్న హాస్పటల్ కి  శ్రీనివాస్ వెళ్లాడు. తొడ పై భాగంలో ఉన్న చర్మం కాలి మరో లేయర్ వరకు కాలిపోయిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తెలిపారు.  వెంటనే అప్రమత్తం కాకపోయి కండరాల్లోకి వెళ్లి తీవ్రంగా నష్టం జరిగేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -