Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని, పార్టీ పదవులను ఎవరూ క్యాజువల్‌గా తీసుకోవద్దని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి చేప్పారు. ఇవాళ గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనతో పాటు కులగణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చాలా విజయాలు సాధించామని చెప్పుకొచ్చారు. తాను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వ చేసుకున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షులలో చాలామందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయి. పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.

పార్టీ పదవులతోనే అందరికీ గుర్తింపు, గౌరవం దక్కుతుందని అన్నారు. రాజకీయాల్లో ఎదుగుదలకు పార్టీ పదవులు ఉపయోగపడుతాయని తెలిపారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని జోస్యం చెప్పారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని, నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని, కలిసికట్టుగా ఇవాళ్టి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుని కష్టపడి మళ్లీ రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారమని తెలిపారు. ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి.. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు లభిస్తుందిని సీఎం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -