గుండెపోటుతో ముత్యాలమ్మ కన్నుమూత
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి) : ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు కొండగరి రాములుకు సతీ వియోగం జరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె గురువారం రాత్రి మృతి చెందారు మృతికి సీపీఐఎం, బీఆర్ఎస్ పార్టీలు సంతాపని ప్రకటించాయి. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సతీమణి కొండిగారి ముత్యాలమ్మ గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వయో భారం రీత్యా ఆమెకు ఇంటి వద్దనే వైద్యం అందజేస్తున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.
ముత్యాలమ్మ ఆకస్మిక మృతి పట్ల సీపీఐఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్, ఏర్పుల నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు బుగ్గరాములు, ఐద్వా జిల్లా నాయకురాలు మస్కు అరుణ, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ సంతాపం తెలిపారు. అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మాజీ చైర్మన్ చుట్టూ వెంకటరమణారెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ముత్యాలమ్మ మృతదేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, కుంటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో సీపీఐఎం నాయకులు పోచమోని కృష్ణ, కేవీపీఎస్ జిల్లా నాయకులు వీరేష్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువ నాయకులు జెర్కొని రాజు, మడుపు శివసాయి, మాజీ కౌన్సిలర్లు శంఖర్ నాయక్, ఆకుల సురేష్, కొండ్రు ప్రవీణ్, వరికుప్పల యాదగిరి ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములుకు సతీ వియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES