Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులు

చలో హైదరాబాద్ కు బయలుదేరిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలానికి చెందిన యువ నాయకులు సిద్ధప్ప పటేల్, బాలు యాదవ్,  భగవాన్, విట్టల్ యాదవ్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్‌కు బయలు దేరారు. అక్కడ నిర్వహిస్తున్న గ్రామ, కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా, ఏకమై పయనమయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న మాన్యజ్ఞులు, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు మండల అధిష్ఠానం ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి కట్టుబాటుతో ఏర్పాట్లు  చేసినట్లు తెలిపారు.

సభ ముఖ్య ఉద్దేశ్యాలు:

రాజ్యాంగంపై అవగాహన కల్పించడం.
బాపూ, అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం సామాజిక న్యాయం సాధన.
గ్రామ స్థాయి నాయకత్వాన్ని శక్తివంతం చేయడం.
కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నింపడం.
ఈ ఆత్మీయ సమ్మేళనం గ్రామాల మధ్య ఐక్యతను చాటిచెప్పే మైలురాయిగా నిలువనుందని పార్టీ నాయకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -