Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బియ్యంను మిల్లర్లు తక్షణమే అందజేయాలి… 

బియ్యంను మిల్లర్లు తక్షణమే అందజేయాలి… 

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
: యాసంగి 2023-24 సీజన్‌కు సంబంధించి బకాయిలో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యంను మిల్లర్లు తక్షణమే పూర్తిగా అందజేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఖరీఫ్, రబీ 2024-25 సీజన్లకు సంబంధించిన బియ్యం డెలివరీలను వేగవంతం చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన రైస్ మిల్లర్ల జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లు తమ మిల్లు సామర్థ్యం మేరకు సిఎంఆర్  బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సమయానికి అందజేయాలని కోరారు. మిల్లర్లు తమకు అప్పగించిన ధాన్యం పరిమాణానికి తగినట్టుగా బియ్యం సరఫరా చేసుకోవాలని, తమ బాధ్యతగా  భావించాలని ఆయన  మిల్లర్లకు సూచించారు.

ఎఫ్‌సీఐ అధికారులు  డెలివరీలకు అనుగుణంగా తగిన సంఖ్యలో గోదాములను ఏర్పాటు చేసి, జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలి అని పేర్కొన్నారు. గోదాముల్లో సరైన తరలింపు కోసం తగినంత మంది హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆయన కోరారు.జిల్లాలో స్థల కొరత ఉన్నందున చిట్యాల గోదామును ప్రత్యామ్నాయంగా వినియోగించేందుకు ఎఫ్‌సీఐ చర్యలు తీసుకోవాలని, బియ్యం నిల్వ , రవాణా సులభతరం చేసేందుకు రైల్వే వ్యాగన్ ల కేటాయింపు పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీ అధికారులు,గోదాం యజమానులు,జిల్లా పౌర సరఫరాల మేనేజర్ డి. హరికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం. రోజారాణి, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -