Saturday, July 5, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య: సీపీఐ(ఎం)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య: సీపీఐ(ఎం)

- Advertisement -

వర్ధంతి కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. భూస్వాములు ,రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదలను కూడగట్టి ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో, భూస్వాముల సాయుధ మూక గూండాలు దొడ్డి కొమురయ్యను కాల్చి చంపడం జరిగిందని, దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడి, 4000 గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూములను భూస్వాముల నుండి పేదలకు పంచటం జరిగిందని తెలిపారు.

అనేక గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకొని పరిపాలన కొనసాగించటం జరిగిందని, అందువల్ల దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి తెలంగాణలో సాయిధరైతంగా పోరాటానికి మార్గదర్శమైందని తెలిపారు. నాటి నుండి దున్నేవాడికే భూమి కోసం జల్ ,జంగల్, జమీన్ నినాదంతో పేదలు పోరాటాల్లోకి ఉవ్వెత్తున కదలడం జరిగిందని ఆయన తెలిపారు. నేటి పాలకులు పేదలకు భూములు పంచాలన్నా.. ఇంటి స్థలాలు ఇవ్వాలన్నా.. మనసు రాక ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.

అదే కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు మాత్రం వేల ఎకరాలను పెడుతున్నారని ఆయన విమర్శించారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని తీసుకొని భూములను బంజరు భూములను పేదలకు పంచాలని అన్నారు. పోరాటాన్ని కుల, మతాలకు అతీతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు నగర నాయకులు కటారి రాములు మరియు నాయక్ వాడి శ్రీనివాస్, హైమద్, దినేష్, రాజు , పద్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -