నవతెలంగాణ-ముధోల్
బాసర, మహబూబ్ నగనర్‌లో ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటి) విద్యార్థుల ప్రవేశ జాబితాను బాసర ఆర్జీయూకేటి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. బాసర ఆర్జీయుకేటి పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థుల ప్రవేశ జాబితాను విడుదల చేసి వివరాలను మీడియాకు వెల్లడించారు. బాసర ఆర్జీయూకేటిలో 1600, సీట్లు, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు అయిన మహబూబ్‌నగర్‌కు 190 సీట్ల భర్తీ కోసం 20258 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని వీసీ పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించిన ఆనంతరం 1690మంది విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులు జాబితాను యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోవాలన్నారు. బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటిలకు ఎంపికైన విద్యార్థులకు బాసర యూనివర్సిటీలోని ఈనెల 7, 8, 9, తేదీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థుల మెరిట్ ఆధారంగా వెబ్సైట్లో పేర్కొన్న తేదీల ప్రకారం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరు కావాలన్నారు. కౌన్సిలింగ్ కు హాజరుకాని విద్యార్థులు సీట్లు కోల్పోతారన్నారు. ఆ సీట్లను వెయిటింగ్ లో ఉన్న విద్యార్థులకు కేటాయించడం జరుగుతుందని వీసి తెలిపారు. ఆగస్టు 4వ తేదీ నుండి అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన 158 సీట్ల కు కౌన్సిలింగ్ వేరుగా ఉంటుందన్నారు. అయితే సెలక్షన్ లిస్ట్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మాత్రం 24 మార్కులు అదనంగా కలపడం జరిగిందన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు అధికంగా సీట్లు వచ్చాయన్నారు. ఈ విద్య సంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులకు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. అయితే తెలంగాణలోని 33 జిల్లాలో నిజామాబాద్‌కు 297 సీట్లు అత్యధికంగా రాగ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 1సీటు మాత్రం మే వచ్చింది. ఎంపికైన విద్యార్థులో బాలికలు 72 శాతం,బాలురు 28 శాతం మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు 88శాతం, ప్రకయివేట్ పాఠశాల విద్యార్థులు 12శాతం ఎంపిక అయ్యారు. సమావేశంలో ఓ ఎస్ డి మురళీధర్సన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో కన్వీనర్ డాక్టర్ దేవరాజు, బండి హరికృష్ణ, డాక్టర్ విఠల్ ,బావుసింగ్, పిఆర్ఓ విజయ్ కుమార్ ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీ విధ్యార్థుల ప్రవేశ జాబితా విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES