సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కలెక్టర్ కార్యాలయంలో తొలగించిన శానిటేషన్ వర్కర్స్ ను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తొలగించిన షానీటేజర్ వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలని అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న షానిటేజర్ వర్కర్ ను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించడం సరైనది కాదని అన్నారు.
ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి అభియోగం లేదు పనిచేస్తున్న కార్మికురాలని తొలగించే దాంట్లో మతలబు ఏమిటి ? ఆమెపైనే కుటుంబం ఆధారపడి ఉన్నది. ఆ కార్మికురాలి జీవన ఉపాధి పైన దెబ్బతీయడం అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డట్టే ఇప్పటికే ఏజెన్సీ వాళ్లతో మాట్లాడడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. కానీ నాలుగైదు రోజులు అవుతున్న ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు అదనపు కలెక్టర్ ని కలవడం జరిగింది. అధికారులపై ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికురాలని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, అల్కానంద, రమ, పద్మా, హేమా, సవిత, నర్సమ్మ ,ఆశా బాయ్ తదితరులు పాల్గొన్నారు.