Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సరస్వతీ పార్క్ శుభ్రం.. కాలనీ వాసుల ఆనందం

సరస్వతీ పార్క్ శుభ్రం.. కాలనీ వాసుల ఆనందం

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని 3వ వార్డులోని సరస్వతి నగర్ పార్క్ గత కొన్ని సంవత్సరాలుగా చెట్లపొదలు, మురుగునీరుతో నిండి ఉంది. అందులో పాములు పందులు విచ్చలవిడిగా ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్ కలిసి జెసిబి సహాయంతో పార్క్, చెట్ల పొదలను తొలగించారు. మురుగునీరు వెళ్ళేందుకు సరైన మార్గాన్ని చేశారు. దీంతో పార్కు మొత్తం శుభ్రంగా తయారయింది. ఇన్ని రోజులు ఎవరూ పట్టించుకోని పార్కును మండల నాయకులు రాఘవేందర్ దగ్గర ఉండి పని చేయించినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -