Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయం9న సార్వత్రిక సమ్మెకు ఢిల్లీలో విస్తృత ప్రచారం

9న సార్వత్రిక సమ్మెకు ఢిల్లీలో విస్తృత ప్రచారం

- Advertisement -

సీఐటీయూ కేంద్ర కార్యాలయం నుంచి గాంధీ మార్కెట్‌ వరకు ఊరేగింపు
కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన నేతలు
సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

9న జరగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక, వ్యయసాయ కార్మిక మహిళా, విద్యార్థి సంఘాలు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ సమ్మె ప్రజలపై మోడీ ప్రభుత్వం విధిస్తున్న భారాలకు, దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటమని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ సీఐటీయూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రచార ఊరేగింపు అజరు భవన్‌, రౌస్‌ అవెన్యూ కోర్టు, మాత సుందరి కాలేజ్‌, కాగ్‌ కార్యాలయం మీదుగా గాంధీ మార్కెట్‌ వరకు సాగింది. స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. మోడీ పాలనలో కార్మిక చట్టాల మార్పులు, వ్యవసాయ విధానాలు, ప్రభు త్వ రంగాల విక్రయాలు వంటివి ప్రజలపై ఎలాంటి భారం మోపుతున్నాయో వివరించారు. ఉపాధి నిధుల తగ్గింపు, సెక్యులర్‌ రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని తెచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అమలు చేయాలని చూస్తున్న విధానాలను, వాటివల్ల ఎదురయ్యే నష్టాలను నేతలు వివరించారు.
గాంధీ మార్కెట్‌లో జరిగిన సభకు సీఐ టీయూ నాయకుడు పలివాల్‌ అధ్యక్షత వహిం చారు. యూనియన్‌ అఖిల భారత నాయకులు ఉమేష్‌, సాయిబాబు, ఐద్వా నాయకురాలు పుణ్యవతి, ఏఐఏడబ్ల్యూయూ నేతలు బి. వెంకట్‌, సాహిల్‌, ఎస్‌ఎఫ్‌ఐ నేత షోహాన్‌, సీఐటీయూ నేత శర్మ, ఐద్వా నేత రేణు పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయా సంఘా ల నేతలు ధ్వజమెత్తారు. కార్మిక చట్టాల మార్పులతో కార్మికులు కోల్పోయే ఉద్యోగ భద్రత, వ్యవసాయ రంగాన్ని అంబా నీ, అదానీల వశం చేసేందుకు తీసుకువచ్చిన ముసాయిదా చట్టాలపై వివరించారు. మహి ళలపై పెరుగుతున్న అణిచివేత, విద్యాసంస్థల స్వతంత్రత తగ్గిపోతోం దని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపద ధనవంతులకు దోచిపెడుతున్నారని విమ ర్శించారు. ఈ విధానాల నేపథ్యంలో కేంద్రా నికి వ్యతిరేకంగా ఈ నెల 9న నిర్వహిస్తున్న సమ్మె ను విజయవంతం చేసి, మోడీ విధానాలకు గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరముందని నొక్కివక్కాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -