– మథుర షాహీ ఈద్గా మసీదుపై అలహాబాద్ హైకోర్టు
– పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ : యూపీలోని మధురలో గల షాహి ఈద్గా మసీదును వివాదాస్పద నిర్మాణంగా పేర్కొనాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌నను అలహాబాద్ కోర్టు తిరస్కరించింది. షాహి ఈద్గా మసీదును వివాదాస్పద నిర్మాణంగా పేర్కొనాలని కోరుతూ న్యాయవాది ప్రతాప్‌సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ధర్మాసనం విచారణం జరిపింది. సదరు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై మసీదు తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది.. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తప్పుబట్టారు. పిటిషనర్.. బ్యాక్‌డోర్ ద్వారా కొత్త కేసును ప్రవేశపెట్టాలనీ చూస్తున్నారనీ, షాహి మసీదు ఈద్గా ఒక మసీదు అనే అంగీకరించిన వాస్తవాన్ని తిరస్కరించటానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు. వాదనలన్నీ విన్న అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. పిటిషనర్ అభ్యర్థించినట్టుగా షాహి మసీదు ఈద్గాను తీర్పులు, ఉత్తర్వులలో వివాదాస్పద నిర్మాణంగా సూచించాలని ఎలాంటి ఆదేశాలూ జారీ చేయటం మంచిది, ఉపయోగకరం కాదని జస్టిస్ మిశ్రా వివరించారు.
ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ప్రస్తుతం 18 వ్యాజ్యాలను విచారిస్తున్నది. ఇవి.. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కృష్ణుడి ఆలయాన్ని కూల్చివేసి దానిపై మసీదును నిర్మించాడని పిటిషనర్లు తమ దావాలలో ఆరోపించారు. కాగా, మసీదును తనిఖీ చేయటానికి కోర్టు కమిషనర్‌ను నియమించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను 2023, డిసెంబర్‌లో హైకోర్టు అనుమతించగా.. గతేడాది జనవరిలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని నిలిపివేసిన విషయం విదితమే.
వివాదాస్పద నిర్మాణంగా ఆదేశించలేం
- Advertisement -
- Advertisement -