Saturday, July 5, 2025
E-PAPER
Homeబీజినెస్ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త బీమా పథకాలు

ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త బీమా పథకాలు

- Advertisement -

నవ జీవన్‌ శ్రీ ఆవిష్కరణ
న్యూఢిల్లీ :
దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ కొత్తగా రెండు ప్లాన్లను ఆవిష్కరించింది. నవ జీవన్‌ శ్రీ, నవ జీవన్‌ శ్రీ సింగిల్‌ ప్రీమియం ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఆ ప్రభుత్వ రంగ సంస్థ శుక్రవారం వెల్లడించింది. రెండూ నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివి డ్యువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవింగ్‌ స్కీములని పేర్కొంది. ఈ ప్లాన్లు జులై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
”ఈ రెండు పథకాలు పాలసీదారుల పెట్టుబడికి భద్రతతో పాటు స్థిరమైన వడ్డీ లాభాలు కోరుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. జీవిత బీమా రక్షణ కూడా అందిస్తాయి. ఈ పాలసీలో నెలకు రూ.10వేల చొప్పున 10 ఏండ్ల పాటు దాదాపు రూ.11 లక్షలు చెల్లిస్తే.. పాలసీ టర్మ్‌ను 20 ఏండ్లు ఎంచుకుంటే.. దాదాపు రూ.26 లక్షల మొత్తం చేతికి రానుందని అంచనా. నవ జీవన్‌ శ్రీ సింగిల్‌ ప్రీమియం ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించగలిగే వారికి ఇది ఉత్తమ ఎంపిక. 30 రోజుల వయసు నుంచీ 60 ఏండ్ల వరకు ఉన్న వ్యక్తులు ఈ పాలసీకి అర్హులు. మెచ్యూరిటీ వయసు 18 ఏండ్ల నుంచి గరిష్టంగా 75 ఏండ్ల వరకు ఉండొచ్చు. పాలసీ వ్యవధి కనిష్టంగా ఐదేండ్లు, గరిష్టంగా 20 ఏండ్ల వరకు ఉండేలా డిజైన్‌ చేశారు. కనీస హామీ మొత్తం రూ.1 లక్ష కాగా.. గరిష్ట పరిమితి ఉండదు.” అని ఎల్‌ఐసీ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -