Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంబలవంతపు భూసేకరణపై ఆగ్రహం

బలవంతపు భూసేకరణపై ఆగ్రహం

- Advertisement -

ఫ్రీడమ్‌పార్క్‌ వద్ద రైతులు, కార్మికుల ఆందోళన
బెంగళూరు :
వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది రైతులు, కార్మికులు ఫ్రీడమ్‌ పార్క్‌ వద్ద ఆందోళనకు దిగారు. శుక్రవారం అక్కడ జరిగిన నిరసన కార్యక్రమంలో రైతు నేతలు విజ్జూకృష్ణన్‌, రాకేశ్‌ తికాయత్‌, తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. కర్నాటకలోని దేవనహళ్లిలోని చన్నరాయపట్నంలోగల 13 గ్రామాలలో విస్తరించి ఉన్న 1777 ఎకరాల బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా 2022 నుంచి 1186 రోజులుగా పోరాటం కొనసాగుతోంది. ఈ వ్యవసాయ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటం నేడు ఒక నమూనాగా మారింది.
ఏఐకేఎస్‌కు అనుబంధంగా ఉన్న కర్నాటక ప్రాంతీయ రైతు సంఘం ప్రారంభించిన పోరాటం నేడు విస్తృత ఐక్య పోరాటంగా ఉద్భవించింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల క్రూరమైన పోలీసు చర్యను ప్రారంభించింది. నాయకులతో సహా అనేక మంది నిరసనకారులను అరెస్టు చేసింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అదే సిద్ధరామయ్య అప్పట్లో రైతులు, కార్మికుల నిరసన పట్ల స్పందించారు. తమ ప్రభుత్వం వస్తే భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు.
చర్చలకు సిద్ధం
ఆందోళన కొనసాగిస్తున్న రైతులు, కార్మికులకు ఏఐకేఎస్‌ నాయకులు గురువారం సంఘీభావం తెలిపారు. శుక్రవారం కూడా వారి ఆందోళనలో పాలుపంచుకున్నారు. దీంతో రైతు నేత లను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలి చింది. భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయిం చింది. తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని కర్నాటక సీఎం హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -