Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములుకు సతీవియోగం

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములుకు సతీవియోగం

- Advertisement -

గుండెపోటుతో ముత్యాలమ్మ కన్నుమూత
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సతీమణి ముత్యాలమ్మ గుండెపోటుతో గురువారం రాత్రి మృతిచెందారు. ఆమె మృతి పట్ల సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌ నాయకులు సంతాపం ప్రకటిం చారు. శుక్రవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటిం చారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సతీమణి కొండిగారి ముత్యాలమ్మ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వయో భారంతో ఆమెకు ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. కాగా గురువారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌, పార్టీ సీనియర్‌ నాయకులు పి.జంగారెడ్డి, ఏర్పుల నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు బుగ్గరాములు, ఐద్వా జిల్లా నాయకులు మస్కు అరుణ, మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేష్‌ ఆమె భౌతికకాయాన్ని సందర్శి ంచి పూలమాలలేసి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ వెంకటరమణారెడ్డి, పార్టీ కార్యకర్తలతో కలిసి ముత్యాలమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పోచమోని కృష్ణ, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు వీరేష్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ యువ నాయకులు జెర్కొని రాజు, మడుపు శివసాయి, మాజీ కౌన్సిలర్లు శంఖర్‌నాయక్‌, ఆకుల సురేష్‌, కొండ్రు ప్రవీణ్‌, వరికుప్పల యాదగిరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -