Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మందకృష్ణ అడుగుజాడల్లో ముందుకెళ్లాలి

మందకృష్ణ అడుగుజాడల్లో ముందుకెళ్లాలి

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి : ఏబిసిడి వర్గీకరణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు ముందుకు వెళ్లాలని ఎంఎస్పి జాతీయ నాయకుడు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగూరి ఆనందరావు మాదిగ అన్నారు. శనివారం మండలంలోని అంగడి ఆవరణలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంద సంఘాల నాయకులతో ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ధర్మయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.

మంద కృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రభావం అన్ని అణగారిన కులాల్లో సామాజిక చైతన్యానికి రగిలించిందని అన్నారు. ప్రతి కులం తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి సంఘాల ఏర్పాటు చేసుకొని పోరాట బాటలోకి వచ్చాయని తెలిపారు. కావాల్సినంత ప్రోత్సాహాన్ని సహకారాన్ని మంద కృష్ణ మాదిగ అందించారు అని ఉపోద్ఘాటించారు. అందువల్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు కార్తీక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కో ఇంచార్జ్ వశపాక కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి గారె నరేష్, నాయకులలు బచ్చలి యకన్న మాదిగ, రామారాపు కుమార్ మాదిగ, చిర్ర రవి, వశాపక ప్రశాంత్, ఐత విరన్న, ఐత రాజు, చిన్నపాక రవి,    చిన్నపాక హరీష్, చెడుపాక గణేష్, చిర్ర దర్గయ్య, చిర్ర సూరి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -