నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : రెవెన్యూ సదస్సు, భూభారతి, కొత్త రేషన్ కార్డులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. శనివారం రోజు జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల తాసిల్దార్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలో ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులో జిల్లాలో మొత్తము 17 మండలాల్లో 301 రెవెన్యూ గ్రామాల్లో 14,918 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 4203 దరఖాస్తులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని,1819 దరఖాస్తులను డిస్పోజల్ కాగా, 361 దరఖాస్తులను అధికారులు అంగీకరించారు. ఈనెల 8వ తారీఖున విచారణ పూర్తి చేసి, జూలై 31 లోగా దరఖాస్తులపై పూర్తి విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో భూభారతి కింద 3129 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, వీటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని తహసీల్దార్, ఆర్డీవోలను ఆదేశించారు. జిల్లాలో కొత్తగా 10690 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. మరో 651 దరఖాస్తులు విచారణ కొనసాగుతుందని ఈనెల 10వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులను పరిష్కరించాలని ఆగష్టు, 14 తేదీ వరకు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయాలన్నారు. ఎన్ఎఫ్బిఎస్ పథకం కింద కుటుంబంలో ఎవరైనా పెద్దలు చనిపోయిన పక్షంలో రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుంది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 626 దరఖాస్తులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ జూమ్ మీటింగ్ లో రెవెన్యూ డివిజన్ అధికారులు,మండల తాసిల్దార్లు పాల్గొన్నారు.