Sunday, July 6, 2025
E-PAPER
Homeసోపతిన్యాయ సమానత్వానికై పోరాడిన నేత

న్యాయ సమానత్వానికై పోరాడిన నేత

- Advertisement -

జులై 6 భారత రాజకీయం, సామాజిక న్యాయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నేత బాబు జగ్జీవన్‌ రామ్‌ వర్ధంతి.
దళితుల అభ్యున్నతి, అస్పశ్యత నిర్మూలన, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఆయన చేసిన కషి అపూర్వం. విద్యాభ్యాస సంబంధంగా, బాబు జగ్జీవన్‌ రామ్‌ లి1927లో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (దీనఖ) లో చేరి బిళ్లా స్కాలర్‌షిప్‌ పొందారు. అక్కడే అస్పశ్యత వ్యతిరేక పోరాటాలకు ముందుండి నాయకత్వం వహించి, వెంటనే కోలకతా విశ్వవిద్యాలయంలో దీ.ూష. (ఖీఱతీర్‌ జశ్రీaరర) పూర్తి చేశారు.
ఆయన సామాజిక సేవ యాత్ర చిన్ననాటి నుంచే ప్రారంభమైంది. కుల వివక్షను స్వయంగా అనుభవించిన ఆయన, దళితులకు సమాన హక్కులు, గౌరవ జీవితం కల్పించేందుకు ప్రభుత్వాల్లో కీలక హోదాల్లో పనిచేశారు. విద్యా రంగం నుంచి రక్షణ శాఖ వరకు, ప్రతి మంత్రిత్వంలోనూ ప్రజానుకూల మార్పులకే పునాదులు వేశారు.
ఇంకా దేవాలయ ప్రవేశ హక్కుల నుంచి భూమి పంపిణీ వరకు అనేక కీలక కార్యక్రమాల ద్వారా ఆయన లక్షలాది మంది దళితులకు వెలుగు చూపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 (అస్పశ్యత నిషేధం), రిజర్వేషన్ల అమలులో ఆయన పాత్ర మరువలేనిది.
ఈ వర్ధంతి సందర్భంగా, బాబు జగ్జీవన్‌ రామ్‌ గారి ఆశయాలను నెరవేర్చేందుకు నేటి పౌరులుగా మనం సమతా దక్పథంతో ముందుకు సాగాలి.
– డా|| కనకరాజు, ఎమ్మెస్సీ, పిహెచ్‌డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -