Monday, July 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశ రక్షణ కోసం ఐక్య ఉద్యమం

దేశ రక్షణ కోసం ఐక్య ఉద్యమం

- Advertisement -

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్త్తోన్న బీజేపీ
సార్వత్రిక సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలందరూ పాల్గొనాలి
ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యులు తమ్మినేని వీరభద్రం
కార్పొరేట్లకు మోడీ ఊడిగం : పోతినేని సుదర్శన్‌
నవతెలంగాణ-కొత్తగూడెం

దేశ రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలనీ, ఈనెల 9న జరగనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్‌లో శనివారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్‌ అధ్యక్షతన ప్రజాసంఘాల పోరాట వేదిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 44 కోట్ల మంది కార్మికులు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల చట్టం చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి హామీ చట్టం రక్షణకు, మహిళలపై జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెలో భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ.. రాజ్యాంగంపై, ప్రతిపక్షాలపై, రచయితలు, మీడియాపై తీవ్రమైన దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలోకి కూడా కార్పొరేట్‌ శక్తులను తీసుకురావడం కోసం మోడీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. దేశాన్ని కాపాడేందుకు కార్మికులు, కర్షకులు ఐక్యమై సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -