Sunday, July 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపెండింగ్‌ స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలి

పెండింగ్‌ స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలి

- Advertisement -

ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థులు
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు
సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పెట్టే కళాశాలలపై చర్యలకు డిమాండ్‌
నవతెలంగాణ-హయత్‌నగర్‌/విలేకరులు

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ధర్నాలు చేశారు. స్కాలర్‌షిప్‌ రాక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హయత్‌నగర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ముందు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్‌ మాట్లాడుతూ.. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,700 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించా లన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ హయత్‌నగర్‌ మండల అధ్యక్షులు సాయి, కార్యదర్శి వంశీ, సభ్యులు వేణు, మహేష్‌, వరుణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తేజ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు నిరసన కార్యకక్రమాలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.అర్జున్‌, సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి తాడూరి భరత్‌ కుమార్‌, కొమురవెల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కర్రోళ్ల లెనిన్‌ రాజ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు.
పెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు వరంగల్‌ నగరంలో గల పోచమ్మ మైదాన్‌ సెంటర్‌లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. మహబూబూబాద్‌ జిల్లాలోని మరిపెడ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. తొర్రూరు పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ధర్నా చేశారు. బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ ఇవ్వాలని, పై చదువుల కోసం కౌన్సెలింగ్‌కు హాజరైతే సర్టిఫికెట్స్‌ కోసం ఇబ్బందులకు గురిచేసే కళాశాలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిరసన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -