Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసమయమివ్వండి

సమయమివ్వండి

- Advertisement -

– బుధ లేదా శుక్రవారం హాజరవుతా : సిట్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమాచారం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వచ్చే బుధవారం, లేదా శుక్రవారం వచ్చి వాంగ్మూలమిస్తానని శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సిట్‌కు సమాచారాన్ని పంపించారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసును విచారిస్తున్న జూబ్లిహిల్స్‌ స్పెషల్‌ టీం అధికారులకు విచారణలో మహేశ్వర్‌రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేసినట్టు ఆధారాలు దొరికాయి. దీంతో ఈ విషయమై తమ ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇవ్వాలని సిట్‌ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసు ప్రకారం ఆయన శనివారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. అయితే, అనివార్య కారణాలతో తాను రాలేకపోతున్నాననీ, వచ్చే బుధ లేదా శుక్రవారం విచారణకు హాజరవుతానని మహేశ్వర్‌రెడ్డి సమాచారాన్ని పంపించారని సిట్‌ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -