Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి

రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి

- Advertisement -

– నిటి ఆయోగ్‌ ఉప కార్యదర్శి అరవింద్‌ కుమార్‌
– వనపర్తి జిల్లాలో రెండ్రోజుల పర్యటన
నవతెలంగాణ- వనపర్తి

భారతదేశ వికాసం అనేది జిల్లాలు, రాష్ట్రాల వికాసంపైనే ఆధారపడి ఉంటుందని నిటి అయోగ్‌ ఉప కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అన్నారు. నిటి అయోగ్‌ డిప్యూటీ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అరుణ్‌ కుమార్‌, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌ సైంటిస్ట్‌ పి.యాదయ్య, సహాయకులు శనివారం వనపర్తి జిల్లాను సందర్శించిందన్నారు. వారికి జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి కలెక్టరేట్‌లో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరా, అవాంతరాలను అధిగమించేందుకు చేపట్టిన చర్యలపై ప్రొజెక్టర్‌ ద్వారా నివేదిక రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2047లో దేశాన్ని అన్ని రంగాల్లో వికసిత దేశంగా చూసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏవిధంగా అమలు అవుతున్నాయో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు వనపర్తి జిల్లాలో శని, ఆదివారం రెండ్రోజులు పర్యటిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని అచ్యుతాపుర్‌, ఖాసింనగర్‌, కానాయపల్లి మంచినీటి శుద్ధి కేంద్రం, రాజీవ్‌ భీమాలిఫ్ట్‌ ఇరిగేషన్‌-2వ కెనాల్‌ను సందర్శించారు. నాణ్యత ప్రమాణాలు ఏవిధంగా ఉన్నాయి, సమస్యలు వస్తే ఏ విధంగా అధిగమిస్తున్నారు అనే విషయాలను తెలుసుకోడానికి వచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ ఇన్‌చార్జి యాదయ్య, మిషన్‌భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, ఇరిగేషన్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి, మిషన్‌ భగీరథ ఈఈ మేఘారెడ్డి, పీడీ డీఆర్డీఓ ఉమాదేవి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad