Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమం

పెండింగ్‌ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమం

- Advertisement -

– ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం చెల్లించకుంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వివిధ రకాల పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ ప్రకారం చెల్లించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గతనెలలో కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించిందని వివరించారు. గతనెలతో కలిపి రూ.1,200 కోట్లు చెల్లించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు. గురుకుల పాఠశాలల సమయపాలనను సవరించాలని సూచించారు. కేజీబీవీ ఉద్యోగులకు కనీస మూలవేతనం చెల్లించాలని అన్నారు. మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని చెప్పారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులివ్వాలని అన్నారు. ఈ ఏడాది సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ బాధ్యులు పి వెంకట్‌రెడ్డి, మనోహర్‌రావు, క్రమశిక్షణా కమిటీ చైర్మెన్‌ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, నాయకులు వంగ మహేందర్‌రెడ్డి, వెంకటనర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -