Tuesday, April 29, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్‌ టారిఫ్‌లతో ముప్పేమీ లేదు

ట్రంప్‌ టారిఫ్‌లతో ముప్పేమీ లేదు

  • ఉద్యోగాలను కాపాడుకోగలం : చైనా ధీమా
    బీజింగ్‌ :
    ట్రంప్‌ వాణిజ్య సుంకాల ప్రభావం నుండి ఉద్యోగాలను రక్షించుకునే సామర్థ్యం తమకు ఉందని చైనా నేతలు స్పష్టం చేశారు. ట్రంప్‌ టారిఫ్‌లతో తమకు వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొన్నారు. అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులకు కలిగే నష్టాన్ని కూడా పరిమితం చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్‌ ప్రభుత్వ అధికారులు సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. అమెరికా దిగుమతులపై చైనా విధించిన 145 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఇతర చర్యలతో పాటూ కంపెనీలకు, నిరుద్యోగులకు మద్దతును అందించగలమని, సులభమైన రుణ సదుపాయం కల్పించగలమ ని సంబంధిత వర్గాలు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. గతవారం చైనా పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం సోమవారం మీడియా సమావేశం జరిగింది. ఎగుమతులు మందగించినప్పటికీ వృద్ధిని కొనసాగించే అంశంపై పొలిట్‌బ్యూరో సమావేశం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీలకు మద్దతు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ జు లాన్‌ పేర్కొన్నారు. రుణాలను ప్రోత్సహించడానికి అవసరమైన రీతిలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లను తగ్గిస్తుందని, రిజర్వ్‌ అవసరాలను సడలిస్తుందని అన్నారు. ఉపాధిని, మార్కెట్లను స్థిరీకరించేందుకు సకాలంలో రాయితీలతో కూడిన విధానాలు ప్రవేశపెట్టనున్నట్టు జు లాన్‌ పేర్కొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img