Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొత్త దుస్తుల్లో మహిళా స్వాట్‌ బృందం

కొత్త దుస్తుల్లో మహిళా స్వాట్‌ బృందం

- Advertisement -

బందోబస్తుల్లో స్విఫ్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీమ్స్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొట్టమొదటిసారిగా ‘స్విఫ్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ టీమ్‌’ (ఎస్‌డబ్ల్యూఏటీ)ని రంగంలోకి దించారు. నగర సీపీ డీజీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక చొరవతో ఈ బృందాలను ఎంపిక చేశారు. ఈ బృందంలో 35 మంది మహిళా పోలీసులున్నారు. వీరు ప్రధానంగా నగరంలో జరిగే ధర్నాలు, ర్యాలీలు, సభలు సమావేశాల సందర్భంగా బందోబస్తులో పాల్గొంటారు. అక్కడ మహిళా నిరసనకారులను సమర్థవంతంగా నివారించడం, వారిని అక్కడి నుంచి తరలించడం చేస్తారు. అంతేకాకుండా నగరంలో జరిగే పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాల బందోబస్తులో కూడా పాల్గొంటారు. జూన్‌ 3న ఎస్‌డబ్ల్యూఏటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ అనంతరం శనివారం వారికి కొత్త యూనిఫామ్‌ అందించారు. మొదటిసారిగా ఈ బృందాలు రాష్ట్ర సచివాలయం వద్ద విధుల్లో పాల్గొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -